ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయం కొన్ని పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. పెళ్లికొడుకు తండ్రి.. పెళ్లి కుమార్తె తల్లి ఇద్దరూ మనసు పడి పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే జంటగా పరారైన ఉదంతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలోని దుండ్వారా ప్రాంతంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.