న్యూజిలాండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ రాధ యాదవ్ (3/35), అరంగేట్ర పేసర్ సైమా ఠాకోర్ (2/26) సత్తాచాటారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో వన్డే అహ్మదాబాద్‌లోనే ఆదివారం జరుగుతుంది.…