ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు పతకాల పంట కొనసాగుతోంది. భారత హెవీ వెయిట్‌లిఫ్టర్ వికాస్ ఠాకూర్ 96 కేజీల విభాగంలో రజతం సాధించి భారత్ పతకాల పంటలో మరో పతకాన్ని జోడించాడు.