2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొమ్మిదవసారి ఆసియా కప్ గెలవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పాకిస్తాన్ ఫామ్ దృష్ట్యా టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. సాధారణంగా ఏదైనా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు…