Opinion poll: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తిరుగులేదని మరో సర్వే తేల్చి చెప్పింది. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ ఎన్డీఏ ఏకంగా 399 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీకి సింగిల్‌గా 342 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి…