Opinion poll: మళ్లీ అధికారం బీజేపీదే.. ఎన్డీఏకి 399 స్థానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opinion poll: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తిరుగులేదని మరో సర్వే తేల్చి చెప్పింది. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ ఎన్డీఏ ఏకంగా 399 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీకి సింగిల్‌గా 342 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి (తృణమూల్ కాంగ్రెస్ మినహాయించి) 94 స్థానాలను గెలుచుకుంటుందని, టీఎంసీ, వైఎస్సార్సీపీ, బీజేపీ, స్వతంత్రులు కలిసి 50 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది.
ఒపీనియన్ పోల్‌కి సంబంధించి మార్చి 1 నుంచి మార్చి 30 వరకు 543 ఎంపీ స్థానాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించింది. మొత్తం 1,79,190 మంది అభిప్రాయాలను సేకరించగా.. వీరిలో 91,100 మంది పురుషులు మరియు 88,090 మంది మహిళలు ఉన్నారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
పార్టీల వారీగా సీట్లు:
బీజేపీ: 342
కాంగ్రెస్: 38
టీఎంసీ: 19
డీఎంకే: 18
జేడీయూ: 14
టీడీపీ: 12
వైపీసీ: 10
ఆప్: 06
సమాజ్ వాదీ పార్టీ: 03
ఇతరులు: 91
పలు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్:
గుజరాత్ రాష్ట్రంలోని 26 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 29 సీట్లు, రాజస్థాన్‌లో 25 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు, ఢిల్లీలోని 07 సీట్లు, ఉత్తరాఖండ్ లోని 05 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 73 సీట్లను కైవసం చేసుకుంటుందని అంచనా.
రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే:
* ఆంధ్రప్రదేశ్: మొత్తం 25 (వైఎస్‌ఆర్‌సీపీ 10, టీడీపీ 12, బీజేపీ 3)
* అస్సాం: మొత్తం 14(BJP 11, AGP 1, UPPL 1, AIUDF 1, కాంగ్రెస్ 0)
* బీహార్: మొత్తం 40 ((BJP 17, JD-U 14, RJD 1, LJP(R) 5, HAM 1, RLM 1, కాంగ్రెస్ 1)
* ఛత్తీస్‌గఢ్: మొత్తం 11 (బీజేపీ 10, కాంగ్రెస్ 1)
* గోవా: మొత్తం 2 (బీజేపీ 2)
* గుజరాత్: మొత్తం 26 (బిజెపి 26)
* హర్యానా: మొత్తం 10 (బిజెపి 10)
* హిమాచల్ ప్రదేశ్: మొత్తం 4 (BJP 4)
* జార్ఖండ్: మొత్తం 14 (BJP 12, AJSU 1, JMM 1)
* కర్ణాటక: మొత్తం 28 (బీజేపీ 22, జేడీఎస్ 2, కాంగ్రెస్ 4)
* కేరళ: మొత్తం 20 (UDF 10, LDF 7, NDA 3)
* మధ్యప్రదేశ్: మొత్తం 29 (బిజెపి 29)
* మహారాష్ట్ర: మొత్తం 48 (బిజెపి 27, శివసేన-యుబిటి 7, ఎన్‌సిపి (అజిత్) 2, శివసేన-షిండే 8, ఎన్‌సిపి-శరద్ 2, కాంగ్రెస్ 1, ఇతరులు 1)
* మణిపూర్: మొత్తం 2 (బీజేపీ 1, కాంగ్రెస్ 1)
* మేఘాలయ: మొత్తం 2 (NPP 1, కాంగ్రెస్ 1)
* మిజోరం: మొత్తం 1 (ZPM 1)
* నాగాలాండ్: మొత్తం 1 (NDPP 1)
* ఒడిశా: మొత్తం 21 (BJD 11, BJP 10)
* పంజాబ్: మొత్తం 13 (AAP 6, కాంగ్రెస్ 3, BJP 3, SAD 1)
* రాజస్థాన్: మొత్తం 25 (బిజెపి 25)
* సిక్కిం: మొత్తం 1 (SKM 1)
* తెలంగాణ: మొత్తం 17 ( బీజేపీ 05, కాంగ్రెస్ 09, బీఆర్ఎస్ 02, ఎంఐఎం 01)
* తమిళనాడు: మొత్తం 39 (డీఎంకే 18, ఏఐఏడీఎంకే 4, బీజేపీ 3, కాంగ్రెస్ 8, పీఎంకే 1, ఇతరులు 5)
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!