శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్‌లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది.…
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఇటీవల తన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్ (TTDI)ని విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్ టూరిజం పరిస్థితి దారుణంగా ఉంది. ట్రావెల్, టూరిజం పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన 119 దేశాల జాబితాలో పాకిస్థాన్ 101వ స్థానంలో ఉంది.