పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్దం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశ భక్తులు మాత్రం పాక్ పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకూ భారత్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది..? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి..?