అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌కప్-2022 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తుది జట్టులో ఎవరెవరికి స్థానం కల్పిస్తే బాగుంటుందన్న విషయాలపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నాడు. రీసెంట్‌గానే ఇషాన్ కిషన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోవాల్సిందేనని, అతడ్ని ఓపెనర్‌గా రంగంలోకి దింపితే పరుగుల వర్షం కురవడం ఖాయమని ఆయనన్నాడు. కానీ, దినేశ్ కార్తీక్‌ని ఎంపిక చేయడం వృధా అంటూ బాంబ్ పేల్చాడు. కార్తీక్ ఆఖర్లో కేవలం రెండు, మూడు ఓవర్లు మాత్రమే ఆడతానంటే కుదరదని…