Social Media Weight Loss Tip: సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోను నమ్మి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఓ కాలేజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానిక దుకాణంలో కొనుగోలు చేసిన ‘వెంకారం’ (బోరాక్స్) అనే పదార్థాన్ని సేవించడంతో యువతి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు కలైయరసి (19) మదురై నగరంలోని సెల్లూర్ ప్రాంతం, మీనాంబల్పురానికి చెందింది. ఆమె తండ్రి వెల్ మురుగన్ (51) రోజువారీ కూలీగా పనిచేస్తుండగా,…