రెండు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి అరుదైన ఆతిథ్యాన్ని అందించారు. ఖతార్ అమీర్‌ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.