భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను…
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. మరోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని పీవీ సింధు చేజార్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కటేథాంగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది. 14-21, 21-13, 10-21 స్కోరు తేడాతో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ఇండియా ఓపెన్ టోర్నీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!! కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్…
భారత బ్మాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. ఇండియన్ ఓపెన్-2022లో భాగంగా క్వార్టర్ ఫైనల్‌లో అశ్మిత చలిహా క్రీడాకారిణిని వరుసగా రెండు సెట్లలోనూ పీవీ సింధు ఓడించింది. తొలి సెట్‌లో 21-7 తేడాతో, రెండో సెట్‌లో 21-18 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ క్వార్టర్స్ గెలుపుతో పీవీ సింధు సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది. Read Also: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి అంతకుముందు మ్యాచ్‌లో ఏరా…
కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతూ పోతున్నాయి కోవిడ్ పాజిటివ్ కేసులు.. భారత్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది.. అయితే, తాజాగా, ఏడుగురు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోవిడ్ బారినపడడం కలకలం సృష్టిస్తోంది.. దీంతో.. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌టోర్నీ- 2022కు కోవిడ్ సెగ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు ఏడుగురు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. వారంతా టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.. ఇప్పటి వరకు కిదాంబి…