India ICC ODI World Cup Record: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ ఈ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ (58)ను భారత్ అధిగమించింది. నిన్నటివరకు 58 విజయాలతో భారత్, న్యూజిలాండ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.…