Iran-Israel : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత…
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ లోని అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్‌ని ఇరాన్ క్షిపణులతో టార్గెట్ చేసింది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్ పొరపాటున చేసిన పనికి భారతదేశానికి ‘‘క్షమాపణలు’’ చెప్పింది. భారతదేశ పటాన్ని ఇజ్రాయిల్ తప్పుగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్‌లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలు నేపాల్‌లో భాగంగా చూపించింది.
India-Israel: భారత్‌లో ఇజ్రాయిల్ రాయబారిగా పనిచేసిన మాజీ దౌత్యవేత్త డేనియల్ కార్మోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాతో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌కి మద్దతుగా భారత్ ఆయుధాలను పంపుతోందని వ్యాఖ్యలు చేశారు.
S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ సమక్షంలో మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్‌లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.