India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.