Electric Cars: భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ 2025లో భారీ వృద్ధిని సాధించింది. 2024తో పోలిస్తే 2025లో 77శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఈవీ అమ్మకాలు 2024లో 99,875 యూనిట్ల నుండి 2025లో 176,815 యూనిట్లకు పెరిగాయి. ఇది ఈవీ మార్కెట్ డిమాండ్‌ను సూచిస్తోంది.
మారుతి సుజుకి అనేక కార్ మోడల్స్, పవర్‌ట్రెయిన్ ఎంపికలతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. అయితే ఇప్పటి వరకు మారుతి ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయలేదు. ఇతర కంపెనీల నుండి చాలా ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ-విటారాను లాంచ్ చేయబోతున్నారు. 2025 సంవత్సరంలో ఇండియాలో ప్రారంభించనున్నారు.