పహల్గాంలో జరిగిన దాడికి గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాక టూరిస్టులు మృతి చెందడంతో అందరూ భారత్‌కు సపోర్టుగా నిలిచారు. మన దేశంలోని పౌరులు ఈ దాడిపై రగిలి పోతున్నారు. పాక్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం "WewantreRevenge" ట్యాగ్ వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిపై శత్రుదేశం పాకిస్థాన్‌లో ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.