సోమవారం ఆల్ పార్టీ మీటింగ్ లో సమావేశాల ఎజెండా తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి సభ మారబోతోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు వినాయక చవితి రోజున పార్లమెంట్ సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
Special Parliament session: కేంద్రం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే కొత్త పార్లమెంట్ కు సభ తరలివెళ్లనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేక యూనిఫాం ధరించనున్నారు. పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్ కోడ్ ఉండనుంది. నెహ్రూ జాకెట్స్, ఖకీ ప్యాంట్స్ ఇలా యూనిఫాంలో పలు మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 18న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. 19న వినాయక చతుర్థి రోజున కొత్త పార్లమెంొట్…