IND vs AUS: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు ఆ నిర్ణయాన్ని సరిగ్గా వాడుకున్నారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత టాప్ ఆర్డర్ తడబాటు చూపించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5) తొందరగా ఔటయ్యాడు. మరోవైపు, పవర్‌ప్లేలో చెలరేగిన అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు.…