Pakistan: భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్‌కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు పాక్, ఆఫ్ఘన్ల మధ్య ఎప్పటి నుంచి సరిహద్దు వివాదం ‘‘డ్యూరాండ్ రేఖ’’తో ముడిపడి ఉంది.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్‌లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం’’గా, పాకిస్తాన్‌ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.