2025 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. బీజేపీ ఎంపీ డీకే అరుణలు ఒకే వేదికపై కనిపించారు. గతంలో ఈ ఇద్దరూ కాంగ్రెస్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. జెండా ఆవిష్కరణ, ప్రోటోకాల్ విషయంలో పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. ఈరోజు మంత్రి హోదాలో జూపల్లి మహబూబ్ నగర్‌లో జెండా ఆవిష్కరణ చేయగా.. ఎంపీ హోదాలో డీకే…
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని…
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్…
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 12వ సారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం గురించి నొక్కి చెప్పారు. మిషన్ మోడ్‌లో సెమీకండక్టర్లపై పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి వస్తాయన్నారు. రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 30-40…
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి వరుసగా 12వసారి ప్రసంగం చేశారు. ఈ సంవత్సరం థీమ్ ‘న్యూ ఇండియా’. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందన అయిన ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక, అమలులో పాల్గొన్న సీనియర్ సైనిక అధికారులను 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్కరించారు. Also…
Ashok Chakra 24 Spokes: ఆగస్టు 15, 2025 న భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మూడు రంగులకు సంబంధించి అందరికీ తెలిసినా, పతాక మధ్యభాగంలో ఉన్న అశోక చక్రం, దాని 24 ఆకుల (గీతలు) వెనుక ఉన్న అర్థం చాలా మందికి అంతగా తెలియదు. పతాకంలోని తెలుపు రంగు మధ్య పట్టీపై నావీ బ్లూ రంగులో ఉన్న…
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాని ప్రతి ఏడాది ప్రారంభంలోనే రూపొందించి విడుదల చేయడంతో పాటు దానిని ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో కూడా పొందుపరుస్తూ ఉంటుంది. దీని ప్రకారం..
మరికొన్ని రోజుల్లో జూలై నెల ముగియనున్నది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు భారీగా ఉండనున్నాయి. మీకు బ్యాంకు పనులు ఏవైనా ఉంటే ముందే తెలుసుకుంటే బెటర్. లేకుంటే బ్యాంకు పనుల్లో జాప్యం, సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్ట్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి,…