India Vs Pakistan: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ జట్టు సైకిల్ స్టాండ్‌ని తలపించింది. 19.1 ఓవర్లలో కేవలం 146 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సరైన ఆరంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ జట్టు నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి (2), అక్షర్ పటేల్ (2), జస్ప్రీత్ బుమ్రా (2) ఇతర వికెట్లు పడగొట్టారు.