సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు బెంగళూరులో ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉన్న భారత్.. పూణేలో పోరుకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచే రెండో టెస్టు ఆరంభం కానుంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో సాధించిన విజయం కివీస్ విశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన విశ్వాసంతో ఉన్న కివీస్.. భారత్‌లో…