మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన…