Water Tax: రాజులు, బ్రిటీషర్ల కాలంలో విచిత్రమైన పన్నులు ఉండేవని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం కానీ.. ప్రస్తుతం మళ్లీ అలాంటి రోజులే రాబోతున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
Income Tax : ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతానికి మీరు ట్యాక్స్ కడుతున్నప్పటికీ దానినంతా ఆదా చేసుకునే మార్గం ఉంది. మీ వార్షిక వేతనం రూ. 10.5 లక్షలు అయితే, ఈ జీతంపై 100శాతం పన్నును ఆదా చేసుకోవచ్చు.
Budget 2023: గత రెండేళ్లుగా బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశే మిగులుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతన జీవులకు ట్యాక్స్ మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 4 శ్లాబుల ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.2.5 లక్షల ఆదాయం వరకు…
Pan-Aadhar Linkage: మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేశారా ? చేయకపోతే త్వరగా చేసుకోండి. లేకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటివరకు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని పన్నుచెల్లింపుదారులను ఆదాయపు పన్నుశాఖ కోరింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. తాజాగా పాన్, ఆధార్ లింకేజీ ప్రక్రియకు 2023 మార్చి 31వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా…
మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి రెండోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. మల్లారెడ్డితో పాటు 16 మంది నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఐటీ ముందు హాజరుకానున్న 14 మంది హాజరు కానున్నారు. మరి 16 మందిలో ఇద్దరు హాజరవుతారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. ఇవాల ఐటీ ముందుకు మంత్రి రెడ్డితో పాటు మరొకరు కూడా హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
Bihar IT Raids: బీహార్‌కు చెందిన కొన్ని వ్యాపార సమూహాలపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్న సంస్థల్లో జరిపిన సోదాల్లో రూ. 100 కోట్లకు పైగా లెక్కలో లేని ఆదాయాన్ని గుర్తించింనట్లు CBDT తెలిపింది.
సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.
నెల్లూరు నగరంలోని పలు బంగారం దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు నుంచి 40 మంది అధికారులు ఏక కాలంలో నెల్లూరు సిటీలోని 15 ప్రాంతాలపై దాడులు నిర్వహించారు.. రికార్డులను పరిశీలించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.. కాగా, మరోవైపు ఇవాళ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌తో పాటు ముసదిలాల్…