మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే.. చాంద్రమాన క్యాలెండర్‌లోని చైత్రమాసపు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్…