వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి.
ఈరోజు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ రాహూల్ గాంధీ అనర్హత వేటు విషయంలో స్టే ఇవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మేము భావిస్తున్నామని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వొద్దని.. స్మార్ట్‌ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.
తక్షణమే పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సూచిస్తోందన్నారు.