IMEEC: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధానికి దారి తీసింది. ముందు హమాస్ మొదలు పెడితే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా గాజా ప్రాంతంలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ యుద్ధం రెండు కీలక ఒప్పందాలను ప్రభావితం చేస్తోంది. ఇజ్రాయిల్-అమెరికా-సౌదీ అరేబియా మధ్య ఒప్పందాన్ని ప్రభావితం చేసింది. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయాలనే అమెరికా లక్ష్యాన్ని ఈ యుద్ధం దెబ్బతీసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సౌదీ బ్రేక్ వేసింది.