బంగాళాఖాతంలో ఈనెల 19న (రేపు) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశ నైరుతి ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ఆదిలాబాద్,…