దేశ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ట్రాలు ఇంకా తేరుకోను లేదు. ఇంతలోనే కేంద్ర వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది.
ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉండగా.. 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది.. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది.. హైదదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా.. శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల…