UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ మసీదులు, మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఇండియా- నేపాల్ సరిహద్దుల్లోని ఉన్నవాటిపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ) వంటి కేంద్ర దళాల సమన్వయంతో శుక్రవారం పెద్ద ఎత్తున యాక్షన్ చేపట్టింది.