Illegal Liquor: అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక ఆధారంగా లిక్కర్ డైరీ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో, డైరీని పోలీసులు గుర్తించారు.
కుటీర పరిశ్రమలా మద్యం తయారీ. యస్.. మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంత మంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్‌బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు.