Gold Smugglers : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ముగ్గురు విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని షూలో దాచి తరలించే ప్రయత్నం చేశారు. కస్టమ్స్ అధికారులు రూ. 1.40 కోట్ల విలువ చేసే 3 కేజీల బంగారం సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Read Also: Kidnap: పెళ్లి పేరుతో బాలికలకు ఎర.. ఆ తర్వాత అస్సాంకే
ఇది ఇలా ఉండగా.. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో దాదాపు తొమ్మిది కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద 2.314 కిలోల స్మిగ్లింగ్ బంగారు కడ్డీలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: Ukraine War: బఖ్‌ముత్‌లో మారణహోమం.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం..
మరో కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లోనూ 7.396 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై మెయిల్ (హౌరా నుంచి చెన్నై) ద్వారా కోల్‌కతా నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగును క్షుణ్ణంగా వెతకగా.. ట్రాలీ బ్యాగ్ లోపలి జిప్ లైనింగ్ జేబులో ఈ బంగారం బయటపడింది. స్మగ్లింగ్ చేసిన ఈ బంగారం విలువ రూ.4.21 కోట్లుగా గుర్తించారు.