చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి సామాజిక మాధ్యమాలు. వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తను భార్య.. భార్యను భర్త.. అతి కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. సంసారాల్లోకి చొచ్చుకొస్తున్న సోషల్ మీడియా కనీవినీ ఎరుగని దారుణాలకు దారి వేస్తోంది. ఫేస్‌బుక్.. వాట్సాప్.. ఇన్‌స్టాగ్రామ్.. ట్విటర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువ. భావస్వేచ్ఛా ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు తొలినాళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ.. అవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు.. నేర ప్రవృత్తికి బాటలు…