ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత పొడిగింపు ఇచ్చారు. అతని పదవీకాలం 2023 నవంబర్ 18 వరకు నిర్ణయించగా.. అతని మూడవ సర్వీసు పొడిగింపు చట్టవిరుద్ధమని జూలై 11న సుప్రీంకోర్టు ప్రకటించింది.
దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరును పెట్టుకోవడం తెలిసిందే. అయితే ఆ పేరును తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్నట్లు పోలీస్ కేసు నమోదైంది. I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్‌ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా…