దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వారు అంచనా వేశారు. థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి పరిశోధకుల బృందం గాస్సియన్ మిక్సర్ మోడల్‌ను ఉపయోగించింది. Read Also: ఒమిక్రాన్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నప్పటికీ, దానిని ఒకచోట నుంచి మరోక చోటికి తరలించేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్ ట్యాంకులు అంటే పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండే ట్యాంకర్లను వెంటబెట్టుకొని తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ వేవ్‌లో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శానిటైజర్ మాదిరిగా చిన్నగా ఉండే ఆక్సిజన్ బాటిల్‌ను రూపోందించారు…