శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పిన స్వామీ వివేకానందా మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. తన లక్ష్యం పట్ల అంకితభావం, టార్గెట్ చేధించేందుకు తను చేసిన కృషి నేడు ఆయనను దేశ అత్యున్నత సర్వీసు అయిన ఐఎఫ్ఎస్ అధికారిని చేశాయి. మరణం అంచుల వరకు వెళ్లిన అతడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. అతను మరెవరో కాదు దేవానంద్ టెల్గోట్. ఇతడు మహారాష్ట్రకు చెందిన…
ప్రస్తుతం యువత టాటూలు వేసుకోవడంలో చాలా ఉత్సహం చూపుతున్నారు. తమకు ఇష్టమైన వారి పేర్లు, ఫొటోలను శరీరంలోని పలు భాగాలపై టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి.
యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. 2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో 14,600 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ -2021లో 86వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కాసర్ల రాజును మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింతమంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. జనగాం జిల్లా సూరారం గ్రామంలో కాసర్ల రాజు చెందినవాడు. అతను గత సంవత్సరం బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసాడు. ప్రస్తుతం అతను ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్…