భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల వేళ.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నాగం పన్నారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, భద్రతా బలగాలు దానిని భగ్నం చేశారు. పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన 25 నుంచి 30 కిలోల ఐఈడీని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి.