కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టాబ్లెట్‌తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మాత్ర వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్‌తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ..…