ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం’. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్…
సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ…