IBOMMA : మాతో పెట్టుకోవద్దు.. పోలీసులకు ఐ బొమ్మ స్వీట్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు.
‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం’. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం. మా టెలిగ్రామ్ గ్రూపులు, సబ్‌స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తాం. రూ. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, OTT, హీరోలకూ షాకింగ్ రివీల్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్‌లో ఉంది. ఇండియా మొత్తంలో మా సపోర్ట్ ఉంది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే – మీరే ఎక్స్‌పోజ్ అవుతారు. ఫ్యాన్స్‌కి సీక్రెట్‌గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతాం. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుంది. రూ. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరిక!
1) హీరోలకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా
2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు, వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.
3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు, ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.
4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.
‘మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది’. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఈ మిడిల్ లో – వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం. ఐ బొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి అది కూడా పెంట మీద అసలు వేయకండి. మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము. (చావుకు భయపడని వాడు దేనికి భయపడడు – There’s nothing more dangerous than a man who has nothing to loose.) అని పోలీసులకు కౌంటర్ గాహెచ్చరిక చేసారు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!