Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్‌లో జరిగిన "ఐ లవ్ మొహమ్మద్" కార్యక్రమంలో ఒక మతాధికారి చేసిన ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. బహిరంగ వేదిక నుంచి మతాధికారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బహిరంగంగా సవాలు చేశారు. మజల్గావ్‌కు వస్తే.. సీఎం యోగిని అక్కడే ఖననం చేస్తానని హెచ్చరించాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.