శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. 7 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,59,116 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,55,811 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.