ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,400 కి చేరింది. ఇక 10 గ్రాముల…
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ స్పెషల్ కోర్టు-1 అదనపు జడ్జిగా వరప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది న్యాయస్థానం… ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోర్టు న్యాయమూర్తిగా కె.జయకుమార్ ను నియమించింది. జస్టిస్ జయకుమార్ ప్రస్తుతం వరంగల్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. తెలంగాణ…
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ట్విట్టర్ లో ఓ యాడ్ చూసి.. 14 లక్షల సైబర్ మోసానికి ఓ యువకుడు బలైపోయాడు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కి చెందిన రాహుల్ ను ట్విట్టర్ లో ఓ యాడ్ ఆకర్షించింది. నీల్ పటేల్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ యాడ్ చూసి.. అధిక లాభాలు వస్తాయని 14 లక్షల క్రిప్టో కరెన్సీ…
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9…
మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ చివరకు సీఎం కేసీఆర్ పైకి మళ్లింది… గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్పై స్పందించిన ఆయన.. సవాల్ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు..…
మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు…
తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర…
ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై…