తెలిసీ తెలియని వయసు.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అదే ప్రేమ అనుకుంటారు. చదువుపై చూపించాల్సిన శ్రద్ధ కాస్తా.. మరోవైపునకు దారి మళ్లుతుంది. అదే సమయంలో పెద్దలు మందలిచినా.. కాస్తా కన్నెర్ర చేసినా లేత మనసు గాయపడుతుంది. అది ఏ విపరీత పరిణామానికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి ఘటనలే హైదరాబాద్‌లో జరిగాయి. ఒకే స్కూలులో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఉసురు తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Tragedy : హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ మండలం, పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెన్నెలగడ్డలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం (మార్చి 10) జరిగిన ఈ ఘటనలో, 26 ఏళ్ల ప్రియాంక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ సిబ్బంది,…