GHMC : భాగ్యనగరవాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను (Property Tax) బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఆస్తులపై భారీగా వడ్డీ (Arrears Interest) పేరుకుపోయింది. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను…