Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని…
‘ఐబొమ్మ’ అనే వెబ్ సైట్ దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయమే.. అయితే దీని వల్ల సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారించిన…
పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. విచారించిన జడ్జి ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవి ని చంచల్ గూడ జైలు కు తరలించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్సైట్లో…
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనలను హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులపై మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్ లపై రెండు కేసులు నమోదు కాగా, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ పై మరో…
బర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బిగ్ ఆపరేషన్ చేపట్టారు. నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు దాదాపు నెలరోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు, ఆపరేషన్ నిర్వహించారు.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ కి చెందిన రోషన్‌సింగ్(25) ఓ రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్‌సింగ్ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి…
Chiranjeevi : సోషల్ మీడియాలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, డిప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డీసీపీ కవిత మీడియాతో మాట్లాడారు. డీసీపీ కవిత వివరాల ప్రకారం.. చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసామన్నారు. 25 పోస్టులకు పైగా గుర్తించామని, వాటిపై దర్యాప్తు…
CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు..…
CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రేపటి నుంచి అన్ని ఆడియో వీడియో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనాలకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షిస్తామని, కాల్స్ రికార్డు చేస్తామని ఓ పోస్ట్‌లో తప్పుడు వార్తను షేర్ చేశారు. ఈ అంశంపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. తన ఫొటోతో ముద్రించిన ఈ నకిలీ పోస్ట్‌పై సీరియస్ అయ్యారు. వాట్సప్ కాల్స్ రికార్డ్…
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతున్న కొన్ని ‘X’ హ్యాండిల్ ప్రొఫైల్స్‌ను జతచేస్తూ ఆయన తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలకు సంబంధించి గతంలో సిటీ సివిల్ కోర్ట్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఇంకా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read:Khawaja Asif:…