తెలిసీ తెలియని వయసు.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అదే ప్రేమ అనుకుంటారు. చదువుపై చూపించాల్సిన శ్రద్ధ కాస్తా.. మరోవైపునకు దారి మళ్లుతుంది. అదే సమయంలో పెద్దలు మందలిచినా.. కాస్తా కన్నెర్ర చేసినా లేత మనసు గాయపడుతుంది. అది ఏ విపరీత పరిణామానికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి ఘటనలే హైదరాబాద్‌లో జరిగాయి. ఒకే స్కూలులో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఉసురు తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ATM Robbery: హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి, అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు. జూలై 8 రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. Read Also:HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలిజ్ ఈవెంట్.. పవన్ స్పీచ్…
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?