Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్‌లో 8 మంది వ్యక్తులకు…
Madapur IT Scam: మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో కలకలం రేపుతోంది. స్థానికంగా పేరొందినట్టు నటిస్తూ కార్యకలాపాలు నిర్వహించిన NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం బయటపడింది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి…
హైదరాబాద్ లోని బండ్లగూడలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి యువకుడిని కత్తులతో దాడి చేసి హతమార్చారు దుండగులు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. Read Also: Offers Liquor to Tiger: ఎవడండి బాబు వీడు.. పెద్ద పులికే మందు తాగించుబోయాడు నగరంలోని ఘౌస్‌నగర్ లో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు…
Harish Rao father death: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచారు. ఈ మరణ వార్త వినగానే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
Fake Babas Gang: దుండిగల్ ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగ బాబాల అవతారమెత్తి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూసిన ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆ తర్వాత మత్తుమందు చల్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి నుంచి నగదు దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి దొంగ ‘బాబా’…
Chaadarghat Shooting Case: చాదర్ఘట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బషీర్బాగ్లో నిన్న డీసీపీల సమావేశానికి చైతన్య హాజరయ్యారు. సమావేశ అనంతరం తిరిగి సైదాబాద్ లోని తన కార్యాలయానికి బయలుదేరారు. కోఠి దగ్గర ఓ స్నాచింగ్ ముఠా ఓ వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ చోరీ చేస్తున్న విషయాన్ని డీసీపీ డ్రైవర్ గమనించారు. స్నాచింగ్ చేసి ఆటోలో పరార్ అవుతున్న ముగ్గురు నిందితుల గురించి డీసీపీకి చెప్పారు. డీసీపీ ఆదేశంతో…
Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భార్యాభర్తలు సుమారు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ. 150 మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.