Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఆడపిల్ల బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. అర్ధరాత్రి కాదు కదా.. కనీసం పసిబిడ్డతో పట్టపగలు రోడ్డుపై నడిచి వెళ్లేందుకు సైతం స్వేచ్ఛ లేని దుస్థితి ఎదురవుతోంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఒక దారుణమైన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒక మహిళ పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఒక కీచకుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు.
అసలు ఏం జరిగింది?
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నంబర్ 4 లో ఒక మహిళ తన రెండున్నరేళ్ల పసిబిడ్డను తీసుకుని నడుచుకుంటూ వెళ్తోంది. అప్పటికే ఆమెను వెంబడిస్తున్న ఒక కామాంధుడు, ఎవరూ లేని సమయం చూసి వెనుక నుంచి ఒక్కసారిగా నడిరోడ్డుపైనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె దుస్తులను పైకెత్తి వికృత ఆనందం పొందాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘోరానికి ఆ మహిళ షాక్‌కు గురవ్వగా.. ఆ కీచకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ అనాగరిక చర్య మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. “పట్టపగలే ఇంత తెగింపా? ఇలాంటి మృగాళ్లను నడిరోడ్డుపై ఉరితీయాలి” అంటూ నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి పనులు చేయాలంటేనే మగాళ్లకు చెమటలు పట్టేలా కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ఈ ఘటనను సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వీడియో నార్సింగి పోలీసుల దృష్టికి వెళ్లడంతో మే 19న కేసు నమోదు చేశారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కొన్ని రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి సంకెళ్లు వేశారు. పోలీసుల విచారణలో నిందితుడిని పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు (26) గా గుర్తించారు. ఇక పోలీసులు ఈ కామాంధుడికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకో వ్యక్తి ఇలాంటి ఘటనలు చేయాలంటే వణుకు పుట్టేలా చేశారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చట్టాలు ఎన్ని ఉన్నా, పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే మృగాళ్ల సంఖ్య తగ్గడం లేదు. కానీ, ఈ కేసులో పోలీసులు స్పందించిన తీరు, నిందితుడిని పట్టుకున్న వేగం ప్రశంసనీయం.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!